BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఒకే సమాధిలో 572 అస్థిపంజరాలు, శ్రీలంకలో దొరికిన మానవ అవశేషాలు ఎవరివి?
జాఫ్నా ప్రాంతంలోని చెమ్మణిలో శ్మశానవాటిక విస్తరణ పనులు చేస్తుండగా కార్మికులకు మానవ అవశేషాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో ఆగస్టు నాటికి మూడో దశ తవ్వకాలను ఆర్కియాలజీ విభాగం పూర్తి చేసింది.
రాహుల్ గాంధీ సభలకు వస్తున్నది విద్యార్థులా, యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘాల కార్యకర్తలా?- బీబీసీ గ్రౌండ్ రిపోర్టు
రాహుల్ గాంధీ కార్యక్రమంతో యువత నిజంగా మమేకమవుతుందా? వివిధ నగరాల్లో పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు, నిరుద్యోగం, చివరికి పితృస్వామ్యాన్ని కూలదోయాలన్న పిలుపు వంటి అంశాలపై రాహుల్ గాంధీ ప్రసంగాలను యువత ఎలా చూస్తుంది?
లిఫ్టు ప్రమాదాలకు కారణమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణలో లిఫ్టు పాలసీ ఏమైంది?
తెలంగాణలో లిఫ్టుల భద్రతపై 2025లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నేపథ్యంలో లిఫ్టులు, ఎస్కలేటర్ల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో లిఫ్టు పాలసీ తీసుకురావాలనే ప్రతిపాదన 2015లోనే తెరపైకి వచ్చింది.
అనారోగ్యంతో ఆఫీసుకు సెలవు పెట్టాలంటే ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తోందా? కారణం ఇదే కావొచ్చు...
తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాసరే ఆఫీసుకు వెళితేనే తమకు గుర్తింపు దక్కుతుందని ఉద్యోగులు భావిస్తుంటారు. అనారోగ్యంతో ఉన్నా పనిచేస్తున్న వారిని మేనేజర్లు పొగిడితే, మిగతా సిబ్బంది ఆ విషయాన్ని వెంటనే పసిగడతారు.
'25 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నలను అరెస్ట్ చేశారు, వారు బతికున్నారో లేదో ఇప్పటికీ తెలియడం లేదు'
తండ్రి కనిపించకుండా పోయే ముందు రోజు రాత్రి తనకు ఏదో 'చెడు జరుగుతుందనే అనుమానం' వచ్చిందని హన్నా చెప్పారు. దీంతో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన కాళ్లను తన కాళ్లతో తాడుతో బంధించానని హన్నా గుర్తు చేసుకున్నారు. ఉదయాన్నే ఆ ఆ తాడును విప్పి బయటకు వెళ్లిన తండ్రి నిజంగానే వెనక్కు తిరిగి రాలేదు.
చైనా, పాకిస్తాన్ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఏమిటి, భారత్ ఆగ్రహానికి కారణమేంటి?
"ఇటీవల అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు పర్యటన ముగిసిన తర్వాత ఈ సమాచారాన్నివెల్లడించడం ద్వారా తమ వ్యూహాత్మక భాగస్వామ్యంపై పాకిస్తాన్‌కు భరోసా ఇవ్వడంతోపాటు, బహుపాక్షిక సంబంధాలు కొనసాగించినంత మాత్రాన దక్షిణాసియాపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని భారత్‌కు గుర్తుచేయడమే దీని ఉద్దేశం’’






